ఇంట‌ర్ అడ్వాన్స్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై కలెక్టర్ సమావేశం

ఇంట‌ర్ అడ్వాన్స్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై కలెక్టర్ సమావేశం

కృష్ణా: ఈ ఏడాది ఇప్ప‌టికే వివిధ ప‌రీక్ష‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని.. ఇదే విధంగా ఇంట‌ర్ అడ్వాన్స్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేయాల‌ని  క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. క‌లెక్ట‌రేట్‌లో ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.