జిల్లాలో నేటి నుంచి రెండో విడత నామినేషన్లు
VKB: డివిజన్‌లోని ఏడు మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. వికారాబాద్, ధారూర్, మోమిన్‌పేట్ సహా మొత్తం ఏడు మండలాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ధారూర్‌లో 34, వికారాబాద్‌లో 21 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 2 వరకు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని అధికారులు తెలిపారు.