'ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి'
JGL: ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని జగిత్యాలకు చెందిన రవిశంకర్ అన్నారు. పట్టణంలోని తహశీల్ చౌరస్తాలో ఆదివారం డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శామ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దేవయ్య, కాంతారావు, గోవర్ధన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.