'వెంటనే పీఆర్సీ ప్రకటించాలి'
SRD: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని టీటీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం పోతిరెడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నాయని విద్యా కమిషన్ నివేదికలో పేర్కొనడం సరికాదని మండిపడ్డారు.