పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం

పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఎల్లక్కపేట గ్రామంలోని ఆదిశంకరాచార్య పత్తి మిల్లులో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మిల్లుకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. అగ్ని ప్రమాదం జరిగిన పత్తి నష్టంపై అధికారుల సమక్షంలో అంచనా వేయనున్నారు.