VIDEO: "జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి"
HNK: హన్మకొండ జిల్లా కోర్టులో ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తులు నిర్మల గీతాంబా, అపర్ణా దేవి మంగళవారం తెలిపారు. జిల్లాలోని కక్షిదారులు మెగా జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలని వారు సూచించారు. రాజీ మార్గమే రాజా మార్గమని వారు పేర్కొన్నారు.