పంటలపై ఒంటరి ఏనుగు దాడులు..!
CTR: పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మండలంలోని పాలెం పంచాయతీలో గురువారం వేకువ జామున మామిడి చెట్లను ఒంటరి ఏనుగు ధ్వంసం చేసింది. అడవిలోని చింతల వంక నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు అటవీ సరిహద్దులో ఉన్న పొలాల్లోకి చొరబడి మామిడి చెట్లను ఇష్టానుసారంగా ధ్వంసం చేసింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.