రోడ్డు ప్రమాదంలో పాదాచారుడికి గాయాలు

RR: శంషాబాద్ సమీపంలోని బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ పాదాచారుడిని డీసీఎం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు గమనించి గాయాలైన క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.