VIDEO: వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
NRML: కడెం మండల కేంద్రంలోని సీతారామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకను వేదిపండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ బృహత్తర సన్నివేశాన్ని చూడడం కోసం మండల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరై సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు.