సంక్రాంతి వేళ రెచ్చిపోతున్న కిలేడీ దొంగలు
VSP: సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకుని బంగారు షాపులను లక్ష్యంగా చేసుకున్న కిలాడీ లేడీల దొంగతన యత్నాలు వెలుగుచూశాయి. పెందుర్తిలోని వెంకటేశ్వర జ్యువెలరీలో బంగారం దోచి పారిపోతున్న మహిళలను దుకాణదారులు పట్టుకోగా, గాజువాకలోని ఓం జ్యువెలరీ షాప్‌లో ఆభరణాలు జడలో దాచే ప్రయత్నం చేసిన మహిళను షాప్ యజమాని గమనించి పోలీసులకు అప్పగించారు.