బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

CTR: మండలంలోని ఆర్.నడింపల్లి పంచాయతీ దిగువబొంపల్లికి చెందిన సురేంద్ర(25) గ్రామం నుంచి వెళ్తుండగా మిట్టపల్లి సమీపంలో బైక్ అదుపు తప్పి ప్రమాదానికి జరిగింది. ఈ ప్రమాదంలో సురేంద్రకు తీవ్ర రక్త గాయాలు కాగా స్థానికులు 108లో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా, పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.