సంక్షేమ పథకాలపై గ్రామస్తులకు అవగాహన

సంక్షేమ పథకాలపై గ్రామస్తులకు అవగాహన

SDPT: అక్కన్నపేట మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామసభలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యాచరణ అమలు విధి విధానాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించారు. గ్రామాభివృద్ధి, సమస్యల పరిష్కారం దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో సూచించారు.