కేటీఆర్ దిగజారుడు మాటలు సరికాదు: జగ్గారెడ్డి

కేటీఆర్ దిగజారుడు మాటలు సరికాదు: జగ్గారెడ్డి

SRD: కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ అంటూ కేటీఆర్ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ భవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంతోనే రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం రాజకీయంగా లబ్ధి పొందిందని గుర్తు చేశారు.