పొలాల్లో వృద్ధుడి మృతదేహం లభ్యం

పొలాల్లో వృద్ధుడి మృతదేహం లభ్యం

MLG: ఏటూరునాగారం మండలం లంబాడీ తండా గ్రామ పొలాల్లో ఓ వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల వివరాలు.. మతిస్తిమితం లేక వారం రోజులుగా రామన్నగూడెం, రాంనగర్, లంబాడీ తండా పరిసర ప్రాంతాల్లో ఓ వృద్ధుడు తిరిగాడు. దుక్కి దున్నిన పొలంలో బోరు వద్ద దాహార్తి తీర్చుకోవడానికి వెళ్లిన క్రమంలో బురదలో మృతి చెంది ఉంటాడని స్థానికులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.