భర్తపై హత్యాయత్నం.. భార్యకు రెండేళ్ల జైలుశిక్ష

భర్తపై హత్యాయత్నం.. భార్యకు రెండేళ్ల  జైలుశిక్ష

కృష్ణా: భర్తపై హత్యాయత్నం చేసిన కేసులో భార్యకు రెండేళ్ల జైలుశిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ విజయవాడ 8వ అడిషనల్ డిస్ట్రిక్ట్ &సెషన్స్ జడ్జి డి. లక్ష్మి సోమవారం తీర్పునిచ్చారు. 2016లో వివాహేతర సంబంధం నేపథ్యంలో వందనం, విజయరాజులతో కలిసి భర్త వెంకటేశ్వరరావుపై భార్య మల్లేశ్వరి దాడి చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.