పుంగనూరులో ఫుడ్ కమిషన్ పర్యటన

CTR: రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి మంగళవారం పుంగనూరులో పర్యటించారు. ఈస్ట్ పేటలోని రేషన్ దుకాణాన్ని ఆమె సందర్శించి సరుకుల పంపిణీని పరిశీలించారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని సూచించారు. తర్వాత దోబి కాలనీలోని SC, BC హాస్టల్స్‌ను సందర్శించారు. మెనూ పాటించడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని వార్డెన్లకు సూచించారు.