రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కలెక్టర్

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కలెక్టర్

BPT: జే. పంగులూరు మండలం చందలూరులో బుధవారం 'రైతన్న మీకోసం' వారోత్సవాలు జరిగాయి. ఈ వర్క్‌షాప్‌లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.