ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

KMM: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో విషాదం నెలకొంది. శుక్రవారం మద్దులపల్లి NSP కాల్వలో ఈతకు వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో పుట్టబంతి రామకృష్ణ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఉమేష్, వరుణ్ సందేశ్, సందీప్, బాలాజీలతో కలిసి ఈతకు వెళ్లిన రామకృష్ణ ఈత రాకపోవడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.