మధ్యాహ్నానికే సత్తుపల్లి మున్సిపల్ ఫలితాలు
KMM: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేడు సత్తుపల్లి జ్యోతి నిలయంలో జరగనుంది. ఉదయం 8 గంటలకు రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 23 వార్డులకు గాను తొలి రౌండ్లో 12, రెండో రౌండ్లో 11 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. గంటన్నరలోనే తొలి ఫలితం రానుండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.