అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

VZM: మెంటాడ మండల కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మండల విధికి చెందిన సత్యవతి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రూ.70వేల నగదు, 3 తులాల బంగారంతో సహా పలు వస్తువులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.8 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.