30 పడకల ఆసుపత్రి రెడీ.. ప్రారంభంపై ఉత్కంఠ!
KMR: పిట్లం మండల ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోంది. పిట్లంలో 30 పడకల సామర్థ్యం గల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే పిట్లంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులకు వైద్యం అందుబాటులోకి వస్తుంది. అయితే, ఆసుపత్రిలో వైద్య పరికరాలు ఇంకా సమకూర్చాల్సి ఉంది.