'15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా క్యాంపైన్-2025'

ELR: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విస్త్రృతంగా నిర్వహించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులకు సూచించారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో హర్ ఘర్ తిరంగా క్యాంపైన్-2025 నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రజల్లో స్వాతంత్య్ర ఉద్యమంపట్ల అవగాహన, దేశభక్తిభావం పెంపొందించాలన్నారు.