ప్రపంచ తెలుగు మహా సభలకు ఆహ్వానం
CTR: ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు పి. తులసీనాథం నాయుడికి ఆహ్వానం అందింది. 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులోని నందమూరి తారకరామారావు వేదికపై ఈ మహాసభలు జరగనున్నాయి. దీనికి హాజరు కావాలని కోరుతూ ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆహ్వాన పత్రిక పంపినట్లు ఆయన వెల్లడించారు.