మానవాళికి అతిపెద్ద శత్రువు ఉగ్రవాదం: మోదీ

ప్రధాని మోదీ, అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. 'మానవాళికి అతిపెద్ద శత్రువుగా ఉగ్రవాదం మారింది. ఉగ్రవాదం ప్రపంచశాంతికి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా తయారైంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచదేశాలు కృషి చేయాలి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అంగోలాతో కలిసి పనిచేయటానికి భారత్ సిద్ధంగా ఉంది' అని మోదీ స్పష్టం చేశారు.