పూలే జయంతి.. సీపీఐ ఘన నివాళి
VSP: మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని విశాఖ జడ్జి కోర్ట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి ఎస్‌కే.రహిమాన్ మాట్లాడుతూ.. పూలే దంపతులు కులవివక్ష నిర్మూలన, మహిళా విద్య, బాల్యవివాహాల నిర్మూలన కోసం చేసిన సేవలను కొనియాడారు. ప్రభుత్వాలు విద్య, వైద్యం, పోషకాహారంపై మరింత దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.