ప్రజల సంతకాలు సేకరించిన పాడేరు ఎమ్మెల్యే
ASR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ మంగళవారం జీ.మాడుగుల మండల కేంద్రంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు వారపు సంతకు వచ్చిన ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు కలిగే నష్టాలను అక్కడవారికి వివరించారు.