ఇంటర్ అడ్మిషన్ల కోసం కాలేజీల వేట

ఇంటర్ అడ్మిషన్ల కోసం కాలేజీల వేట

TG: 10 పరీక్షలు పూర్తి కాకముందే.. ఇంటర్ అడ్మిషన్ల కోసం కొన్ని కళాశాలలు వింతగా మెసేజ్‌లు చేయడం కలకలం సృష్టిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో కార్పొరేట్ కళాశాలలు.. తమ కాలేజీల్లో స్వర్గం ఉంటుందన్నట్లు విద్యార్థుల అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులకు మెసేజ్‌లు చేస్తున్నాయట. ముందస్తుగా అడ్మిషన్ తీసుకుంటే రాయితీ ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. ఈ మేరకు రోజూ ఫోన్ చేసి వేధిస్తున్నారట.