VIDEO: కూలిన స్కూల్ ప్రహరీ గోడ

నాగర్ కర్నూల్: జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి 24వ వార్డులోని నేషనల్ హై స్కూల్ ప్రహరీ గోడ నేలకొరిగింది. మిగతా భాగం బలహీనపడి కూలెందుకు సిద్ధంగా ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.