జాతీయ చేనేత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
SRD: జిల్లాలో జాతీయ చేనేత అవార్డులకు అర్హులైన వారు మార్చి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చేనేత శాఖ సహాయ సంచాలకులు వెంకటరావు తెలిపారు. దరఖాస్తుదారులు తాము స్వయంగా మగ్గంపై రూపొందించిన కొత్త డిజైన్లను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఎక్కడా లేని వినూత్న డిజైన్లకు ప్రాధాన్యత ఉంటుందని, వివరాలకు స్థానిక చేనేత కార్యాలయంలో సంప్రదించాలన్నరు.