ఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్

ఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్

ప్రకాశం: త్రిపురాంతకం మండలం కొత్త ముడివేముల గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదు మందిని గురువారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1,02,150 భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.