సహాయ కార్యదర్శిగా వెంకటప్పయ్య నియామకం

సహాయ కార్యదర్శిగా వెంకటప్పయ్య నియామకం

NRML: తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య సహాయ కార్యదర్శిగా పీసుపాటి వెంకటప్పయ్య నియమితులయ్యారు. ఖానాపూర్ పట్టణానికి చెందిన వెంకటప్పయ్య మంగళవారం వరంగల్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య సహాయ కార్యదర్శిగా నియమించారు. ఖానాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కావాలి సంతోష్, పలువురు ప్రముఖులు అభినందించారు.