మల్లమ్మ సెంటర్ ట్రాఫిక్ సిగ్నల్స్‌కు మరమ్మతులు
PLD: నరసరావుపేట మల్లమ్మ సెంటర్‌లో గతకొన్ని నెలలుగా పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్‌కు మంగళవారం రాత్రి ఎట్టకేలకు మరమ్మతులు చేశారు. గత కొన్ని నెలలుగా పని చేయని ట్రాఫిక్ సిగ్నల్స్ పై ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ప్రత్యేక దృష్టి సారించి మరమ్మతులు చేయించారు. దీంతో గత కొంతకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం అయింది.