డెంకాడలో పర్యటించిన ఎమ్మెల్యే
VZM: డెంకాడ మండలంలోని పేడాడ, రాజుల తమ్మాపురం గ్రామాలలో రూ.71.40 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మండల పరిధిలోని గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన తన ప్రధాన లక్ష్యమన్నారు.