త్రీటౌన్ బీజేపీ అధ్యక్షురాలిగా దార్ల మల్లేశ్వరి

KMM: ఖమ్మం త్రీటౌన్ బీజేపీ పార్టీ అధ్యక్షురాలిగా దార్ల మల్లేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. త్రీటౌన్‌లో బీజేపీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.