మురుగు ప్రవాహానికీ అడ్డుకట్టేది

మురుగు ప్రవాహానికీ అడ్డుకట్టేది

HYD: కేపీహెచ్బీ 15 ఫేజ్‌లో నిత్యం రోడ్డుపై ఇలా మురుగునీరు ప్రవహిస్తోంది. మురుగు కారణంగా వాహనచోదకులు ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వస్తోంది. నెలల తరబడి ఈ సమస్య ఇక్కడ నెలకొంది. డ్రైనేజీ నీరు, వాటర్ ట్యాంకర్ ప్లాంట్లలోంచి వచ్చే నీరు ఇక్కడ చేరి ఇలా తయారైంది. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.