జాతీయ రహదారిలో ప్రమాదకరంగా మట్టి కుప్పలు

జాతీయ రహదారిలో ప్రమాదకరంగా మట్టి కుప్పలు

CTR: పుంగనూరులో జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలు దర్శనమిస్తున్నాయి. చెన్నై-ముంబైకి ప్రధాన రహదారి ఇది. నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. బాలాజీ కాలనీ నుంచి ఉలవలదిన్నే వరకు పలమనేరు రోడ్డులో డంపింగ్ చేస్తున్నారు. వాహనదారులు కాస్త ఏమరచినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.