పెట్టుబడి వ్యయాన్ని భారీగా పెంచాం: చంద్రబాబు
AP: వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. 'రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్న మా మాటలను ప్రజలు నమ్మారు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చాం. నాడు భవిష్యత్ ఆదాయాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేశారు. 18 నెలల నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. మేం పెట్టుబడి వ్యయాన్ని భారీగా పెంచగలిగాం' అని పేర్కొన్నారు.