VIDEO: 'అక్రమ గ్రావెల్ రవాణా పై చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'అక్రమ గ్రావెల్ రవాణా పై చర్యలు తీసుకోవాలి'

BDK: సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని భాస్కర్ నగర్ నుంచి గాంధీనగర్‌కు జరుగుతున్న అక్రమ గ్రావెల్ రవాణాలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గ్రావెల్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై బోల్తా పడింది. ఈ సమయంలో చుటుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.