'ప్రతి బిడ్డా గొప్ప స్థాయిలో ఉండేలా తల్లిదండ్రుల ప్రోత్సహించాలి'

KDP: ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వం అండగా ఉంటుందని, తల్లిదండ్రులు ఆడబిడ్డలకు ఉన్న స్థాయికి ఎదిగేలా ముందుకు నడిపించాలని రాజంపేట TDP ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. సోమవారం రాత్రి ఒంటిమిట్ట మండలం నర్వకాటపల్లి అరుంధతి వాడలో కుమారి సౌమ్య పుష్పాలంకరణ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆశీర్వాదాలు అందించాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు.