కాస్త తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర
19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ.5 తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో రూ.1,595.50 నుంచి రూ.1,590.50కి చేరింది. కోల్‌కతాలో రూ.1,694, ముంబై రూ.1,542, చెన్నై రూ.1,750గా ఉంది. HYDలో కమర్షియల్ సిలిండర్ కొత్త ధర రూ.1,812.50గా నమోదైంది. గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.