'లోక్ అదాలత్‌ను సద్వినియోగంచేసుకోవాలి'

JGL: సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌లో ప్రజలు విస్తృతంగా పాల్గొని, తమ పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్ పర్సన్, జిల్లా జడ్జి శ్రీమతి రత్న పద్మావతి విజ్ఞప్తి చేశారు. శనివారం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, పీపీలు, న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు.