ఆలయంలో ప్రసాద సేవల టెండర్లు
MBNR: చిన్నరాజమూరు గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో 2025 - 26 సంవత్సరానికి సంబంధించిన (లడ్డు, పులిహోర) ప్రసాద సేవలకి టెండర్లను ఆహ్వానిస్తూ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి 2026, జనవరి ఒకటో తేదీ వరకు టెండర్ గడువు ఉంటుందన్నారు. రూ. 1 లక్ష రుసుము డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.