VIDEO: డమ్మీ తుపాకీ కలకలం
MDK: హవేలీ ఘన్‌పూర్ మండలంలో డమ్మీ తుపాకీ కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఎల్లం అనే వ్యక్తికి హైదరాబాద్ చెందిన వ్యక్తితో భూ వివాదం జరిగింది. గురువారం ఎల్లం స్టే ఆర్డర్‌తో వరి పంట కోయడానికి వెళ్లగా, ఒక వ్యక్తి డమ్మీ తుపాకీతో కనిపించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.