VIDEO: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపీ చర్యలు
KKD: ప్రజా సమస్యలు పరిష్కారానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పలు చర్యలు తీసుకుంటున్నారని కార్యాలయం ఇంచార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి తెలిపారు. కొప్పవరం లోని ఎంపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన 35వ వారం ప్రజాదర్బార్ కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలు సమర్పించారు. రీయింబర్స్‌మెంట్, పింఛన్లు వంటి సమస్యలను ప్రజలు తెలిపారు.