చలివేంద్రం ప్రారంభం.. మజ్జిగ పంపిణీ

చలివేంద్రం ప్రారంభం.. మజ్జిగ పంపిణీ

AKP: నర్సీపట్నంలో శ్రీ లక్ష్మీ గణపతి కార్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బగ్గు మోహన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఇవాళ టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మజ్జిగ, అరటి పళ్ళు పంపిణీ చేశారు. వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని రాజేష్ పేర్కొన్నారు.