అక్రమ మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

సత్యసాయి: పుట్టపర్తి మండలం మర్లపల్లి క్రాస్ వద్ద అక్రమ మద్యం విక్రయిస్తున్న మహిళని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ నాగరాజు బుధవారం తెలిపారు. నిందితురాలి నుంచి 35 కర్ణాటక టెట్రా మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితురాలిని ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేయడం జరుగుతుందని తెలిపారు. దాడుల్లో ఎస్ఐ ఉమామనోహర్ రాజు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.