నా తర్వాతి టార్గెట్ అదే: గంభీర్

నా తర్వాతి టార్గెట్ అదే: గంభీర్

తనకు టెస్టు క్రికెట్ ఎంతో ప్రత్యేకమని, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిఫ్ ఫైనల్ 2025-27కు భారత్ అర్హత సాధించాలని కోరుకుంటున్నట్లు గంభీర్ తెలిపాడు. తన తర్వాతి లక్ష్యం WTC టైటిల్ అని, భారత్ ఆడే తర్వాతి 9 టెస్టులపైనే తమ ఫోకస్ అని పేర్కొన్నాడు. 5 రోజుల పాటు కష్టపడి పొందే విజయం కంటే మరో సంతృప్తి ఉండదని.. T20, ODI కంటే టెస్ట్ క్రికెట్ ఇచ్చే సంతోషం ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు.