'అప్రమత్తతే రక్షణ.. ప్రమాదాల నివారణే లక్ష్యం'
SRPT: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మట్టంపల్లిలో సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. హెడ్ కానిస్టేబుల్ రామయ్య మాట్లాడుతూ.. మద్యం తాగి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని సూచించారు. అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం వల్ల వెనక వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. నిబంధనలు పాటించాలని అన్నారు.