పొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించిన మంత్రి
ATP: టవర్ క్లాక్ వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 58 రోజుల పాటు ప్రాణత్యాగం చేసి తెలుగు రాష్ట్రం సాధించిన మహనీయుడి సేవలను వారు కొనియాడారు. ఆయన త్యాగానికి గుర్తుగా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.