అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
MNCL: భీమారం మండలం కేంద్రంలోని కొత్తగూడెం సమీపంలో వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. డ్రైవర్ గోస్కుల జీవన్‌తో పాటు యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.